1000 కోట్ల క్ల‌బ్‌లో బాహుబ‌లి 2

Baahubali 2 Creates History: 1000 crore collection first indian movie

బాహుబ‌లి 2 సినిమా విడుద‌ల అయిన‌ప‌ప్ప‌టినుంచి రికార్డుల‌మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు తాజాగా మ‌రో రికార్డును చేరుకుది.బాహుబ‌ళి2 సినిమా ముందు భారత చలనచిత్ర బాక్సాఫీసు రికార్డులన్నీ చిన్నబోయాయి. ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘బాహుబలి-2’ రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి భారత చిత్రంగా చరిత్ర సృష్టించింది.

ఈ చిత్రం ఇండియాలో రూ. 800 కోట్లు, విదేశాల్లో రూ. 200 కోట్ల కలెక్షన్లను దాటేసిందని, ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదేనని ట్రేడ్ పండితుడు రమేష్ బాలా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది బాహుబలి. శని, ఆదివారాల్లో కలెక్షన్లో ఊపందుకోవటంతో అనుకున్న సమయం కన్నా ముందే బాహుబలి 2 ఈ రికార్డ్ ను అందుకుంది. ఇంతకుముందు అత్యధిక వసూళ్ల రికార్డు ‘పీకే’ పేరిట ఉండేది. ఆ సినిమా రూ.800 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఇప్పుడు ‘బాహుబలి-2’ ఆ రికార్డును కేవలం వారం రోజుల్లోనే దాటేసింది.ట్రెడ్ ఎనలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Realted

  1. కట్టప్పతో శివగామి రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్
  2. “భల్లాలదేవ భార్య ఎవరు?” రాజమౌళి క్లారిటీ ఇదే
  3. ‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?
  4. అనుష్క వల్ల రాజ‌మౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?