Saturday, May 18, 2024
- Advertisement -

కట్టప్పతో శివగామి రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్

- Advertisement -
When Baahubali’s Kattappa And Sivagami Played a Royal Couple Watch Video

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రికార్డులను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో నటించిన వారికి మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా రాజమాత గా శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది.

ఇక బాహుబలి సినిమాలో రాజమాతకు నమ్మినబంటుగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ మంచి మార్కులు కొట్టేశాడు. బాహుబలి-2 రిలీజ్ కావడంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు జవాబు దొరికింది. అయితే రాజమాతకు దండాలు పెట్టే కట్టప్ప ఆమెతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. అదీ రాజు గెటప్‌లో ఇదేంటి? అంటూ విస్తుపోతున్నారు కదూ.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బాహుబలి-2 సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులు విరామంలో స్నాక్స్.. కూల్ డ్రింక్స్ తీసుకుని థియేటర్లోకి రావడంతో షాక్ తిన్నారు. శివగామి, పక్కన కట్టప్ప కూర్చుని రాజుగా ఆమెతో రొమాన్స్ చేయడం చూసి ఇదేంటి అనుకున్నారు.

ఇంతలో కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇస్తాడు. ఆమె మురిసిపోతుంది. వీరిద్దరి రొమాన్స్ పోతీస్ యాడ్ కోసం అని అసలు విషయం తెలియవస్తుంది. ఓస్ యాడ్ కోసం శివగామి, కట్టప్ప ఇలా చేశారా అంటూ ప్రేక్షకులు అనుకున్నారు. బాహుబలికి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి పాపులర్‌ టెక్స్‌టైల్‌ బ్రాండ్‌ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్‌ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్‌ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాజుగా కనిపించాడు. 

{youtube}QBz75NMkVTs{/youtube}

Related

  1. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న నందిత
  2. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్
  3. ఇద్దరి అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న రామ్
  4. స్టార్ హీరోతో రొమాన్స్ చేస్తున్న సమంతా కాజల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -