నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు !

I am a failure politician : Janasena Chief Pawan Kalyan
I am a failure politician : Janasena Chief Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో జనసేన పార్టీకి.. ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీకి చాలానే తేడా ఉంది. గతంలో పార్టీ సంస్థాగతంగా ఏమాత్రం బలం చూపించలేదు.. పార్టీకి స్థిరమైన క్యాడర్ లేదు. పవన్ కూడా పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తాడనే అంచనా కూడా ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో గత ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. ఇక పార్టీ అధ్యక్షుడైన పవన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమి పాలు అయ్యారంటే.. జనసేన పై ప్రజల్లో ఎంత అపనమ్మకం ఉండేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బహుశా ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా పార్టీ అధ్యక్షుడే ఒడి పోవడం ఒక్క జనసేన పార్టీలోనే చోటు చేసుకుంది. ఇక ఆ ఎన్నికల తరువాత పవన్ పూర్తిగా తన వైఖరిని మార్చుకొని నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించి సక్సస్ అయ్యారు..

ప్రభుత్వంపై తనదైన రీతిలో ఘాటైన విమర్శలు చేస్తూ.. అదే విధంగా అధికారం లేకపోయిన అండగా ఉంటాం అనే భరోసాను ప్రజల్లో పవన్ కల్పించడంతో ప్రస్తుతం జనసేన ఏపీలో ఒక బలమైన పార్టీగా రూపాంతరం చెందుతోంది. అయితే గత ఎన్నికల పరాభవం గురించి పవన్ అప్పుడప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ” తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, దాన్ని నేను పర్తిగా అంగీకరిస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చారు. హైదరబాద్ లోని శిల్పాకళ వేధికలో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న ఆయన పై విధంగా చెప్పుకొచ్చారు. అయితే తన ఓటమి వల్ల తనకేమి బాధగా లేదని చెబుతూ.. ఓటమి అనేది విజయనికి మార్గం అంటూ వ్యాఖ్యానించారు పవన్. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే గత ఎన్నికలు ఆయనను ఎంత కుంగ దిశాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఈసారి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా పవన్ కు ప్రజలు ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర మంత్రికి తెలంగాణ మంత్రికి తేడా అదే !

సీమగర్జన.. మరో విశాఖగర్జన అవుతుందా ?

ఒక్క ఛాన్స్ అంటే నమ్మి.. మోసపోయాం !