Monday, April 29, 2024
- Advertisement -

మీ ఫోన్ బ్లూటూత్ తో.. పెను ముప్పే !

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో ప్రతీదీ కూడా టెక్నాలజీ తోనే ముడిపడి ఉంది. ఇక మన జీవన విధానంలో ఈ టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ టెక్నాలజీ అనేది కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీ వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడా అంతే స్థాయిలోనే జరుగుతున్నాయి. టెక్నాలజీలోని కొన్ని లోపాలను ఆసరాగా చేసుకొని హ్యాకర్స్ మొబైల్ లేదా కంప్యూటర్స్ లో మాల్వేర్స్ ప్రవేశ పెడుతూ వినియోగ ప్రైవసీని దెబ్బతిస్తున్నారు. హ్యాకింగ్ కు గురైన మొబైల్ లోని వ్యక్తిగత సమాచారం అంతా దోచేస్తున్నారు.

అంతే కాకుండా బ్యాంకులలోని లక్షల కోట్లకు కన్నం వేస్తున్నారు. కాగా ఈ హ్యాకింగ్ ను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు విస్తృతంగా కృషి చేస్తున్నప్పటికి.. హ్యాకింగ్ అనేది ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటూ టెక్నాలజీకే పెను ముప్పుగా పొంచి ఉంది. ఇక తాజాగా మొబైల్స్ లోనూ, ల్యాప్ టాప్ లలోనూ బ్లూ బగ్గింగ్ అనే మల్వర్ నూ హ్యాకర్స్ డెవలప్ చేశారట. ఈ బ్లూ బగ్ అనే మాల్వర్ బ్లూ టూత్ కనెక్టివిటీ ద్వారా మొబైల్స్ లోకి ప్రవేశించి యూజర్స్ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్స్ కు అందజేస్తుందట.

ఇక మనం మొబైల్ యూస్ చేయడంలో బ్లూ టూత్ నూ అధికంగా వాడుతూ ఉంటాము. ఏవైనా బ్లూ టూత్ కనెక్టివిటీ వస్తువులకు పెయిర్ చేసుకొని వాడుతూ ఉంటాము. హియర్ బడ్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ స్పీకర్స్.. ఇలా చాలా వాటిని బ్లూ టూత్ ద్వారానే కనెక్ట్ చేసి వాడుతూ ఉంటాం. అయితే ఈ బ్లూబగ్గింగ్ అనే మాల్వర్ ఏ వస్తువు నుంచి అయిన బ్లూ టూత్ కనెక్టివిటీ ద్వారా మొబైల్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అనౌన్ వాటితో బ్లూటూత్ కనెక్ట్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్నెట్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా !

సీక్రెట్ వెబ్సైట్ ను ఇలా షేర్ చేయండి.. ఎవ్వరికీ తెలియకుండా !

మొబైల్ పైన గీతాలు పడ్డాయా.. అయితే ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -