Monday, April 29, 2024
- Advertisement -

సీమగర్జన.. మరో విశాఖగర్జన అవుతుందా ?

- Advertisement -

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో తిరుగులేదనే అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాలోని మూడు జిల్లాల్లో వైసీపీ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో జగన్ ప్రభంజనం కొనసాగగా.. అనంతపురంలో మాత్రం టీడీపీ హవా కనిపించింది. రాయలసీమలో మొత్తం నాలుగు జిల్లాలలో కలిపి 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో వైసీపీ 30 స్థానాలను కైవసం చేసుకోగా.. 22 స్థానాల్లో టీడీపీ సత్తా చాటింది. అయితే గత ఎన్నికలకు ముందు జగన్ కు ఉన్న క్రేజ్ వేరు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పై ప్రజల్లో ఏర్పడిన ఒపీనియన్ వేరు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇక రాయలసీమ విషయానికొస్తే.. గతంతో పోలిస్తే సీమలో కూడా ప్రస్తుతం వైసీపీకి పట్టు తగ్గిందనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగానే వినిపిస్తున్నాయి.

అయితే రాయలసీమలో వైసీపీకి ఉన్న బలం కోల్పోకుండా జగన్ వేసిన ప్రణాళిక కూడా అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తెచ్చి కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ సీమ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన ఇప్పటివరకు మూడు రాజధానుల అమలు జరగలేదు. దాంతో ప్రజల్లో కూడా మూడు రాజధానులపై ఆసక్తి తగ్గిందనే చెప్పాలి. మరోవైపు మూడు రాజధానుల అమలు విషయంలో అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతుండడంతో అటు ముందుకు సాగలేక.. ఇటు వెనక్కి రాలేక జగన్ సర్కార్ ఇరుకున పడింది.

ఇక ఈ అడ్డంకులను పక్కన పెడితే త్రీ క్యాపిటల్స్ పై ప్రజా మద్దతు కొరేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆ మద్య విశాఖపట్నంలో మూడు రాజధానుల మద్దతు కొరకు ‘ విశాఖ గర్జన ” పేరుతో ప్రభుత్వమే ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విశాఖ గర్జనకు ప్రజలనుంచి అనుకున్నంతా స్పందన రాలేదు. దాంతో త్రీ క్యాపిటల్స్ పై ఉత్తరాంధ్ర ప్రజలకు ఆసక్తి లేదనే విషయం స్పష్టమైంది. ఇక తాజాగా రాయలసీమపై ఫోకస్ చేస్తూ మూడు రాజధానులకు మద్దతుగా ” సీమ గర్జన ” పేరుతో మరో బహిరంగ సభకు సిద్దమౌతోంది వైసీపీ. ఈ నెల 5న కర్నూల్ లో ” సీమ గర్జన ” పేరుతో ర్యాలీలు, బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే రాయలసీమ ప్రజలకు కూడా మూడు రాజధానులపై పెద్దగా ఆసక్తి లేదని సీమ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే సీమగర్జన కూడా విశాఖ గర్జన మాదిరిగా అట్టకెక్కే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఎవరికి ఇష్టం లేని మూడు రాజధానుల అంశాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతు ప్రజా మద్దతు కొరకు వైసీపీ పాకులాడుతోందని కొందరి అభిప్రాయం.

ఇవి కూడా చదవండి

షర్మిలతో బీజేపీ దోస్తీ కోరుకుంతోందా ?

చంద్రబాబుకు బెదిరింపులా.. నో ఛాన్స్ !

గుజరాత్ ట్రైయాంగిల్ ఫైట్.. గెలుపేవరిది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -