- Advertisement -

ఆ వ్యాధి రావడం వల్లే.. స్నేహా ఉల్లాల్ సినిమాలకు దూరమైయింది..

- Advertisement -
Sneha Ullal Quit Movies for Auto Immune Disorder

బాలీవుడ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా.. .. స్నేహా ఉల్లాల్ కి టాలీవుడ్ లో మంచి ఫేమ్ లభించింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సింహ లాంటి సూపర్ హిట్ సినిమాలో కూడా నటించింది. తెలుగులో చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్.. మూడేళ్లుగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

అయితే తను సినిమాలో కనిపించకపోవడానికి కారణం.. ఇక వ్యాధి అని చెప్పింది స్నేహా ఉల్లాల్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు బ్రేక్ తీసుకోవాలని తాను అనుకోలేదని.. అయితే తన వ్యాధి కారణంగా ఇలా గ్యాప్ ఇవ్వక తప్పలేదని చెప్పింది స్నేహా ఉల్లాల్. ‘రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో బాధ పడ్డాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా నేను మరీ బలహీనంగా మారిపోయాను. నా అంతట నేను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేకపోయేదాన్ని.

{loadmodule mod_custom,Side Ad 1}

దాంతో 2014 వరకు నాకు ఉన్న కమిట్మెట్స్ ను కంప్లీట్ చేసేసే తర్వాత గ్యాప్ తీసుకున్నాను.. ఆ తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకోలేదని.. అని చెప్పింది స్నేహా ఉల్లాల్. సినిమాలు ఆపేసి.. చికిత్స తీసుకున్న స్నేహా ఉల్లాల్.. శారీరకంగా మళ్లీ ఫిట్నెస్ సంపాదించుకున్నానని తెలిపింది. అయితే.. మానసికంగా మాత్రం ఎప్పుడూ తాను బ్యాలెన్స్ కోల్పోలేదని.. కొత్త సినిమాలు చేపట్టడానికి ఇప్పుడు రెడీగా ఉన్నానని అంటోంది.. ఈ అందాల భామ స్నేహా ఉల్లాల్. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  2. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  3. బర్త్‌డే పార్టీలో తాగి ముద్దులు పెట్టిన హీరోయిన్.. అందరూ షాక్
  4. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో హీరోయిన్ కి ఏం పని..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -