Tuesday, May 7, 2024
- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని ప‌రోక్షంగా చెప్పిన భాజాపా ఛీప్‌ అమీత్‌ షా

- Advertisement -
Bjp chief Amith sha shaking commens on bjp and tdp Alliance

రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ-భాజాపా మూడుముల్ల బంధం విడాకుల వ‌ర‌కు వ‌చ్చింది.2014 ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీ చేసిన భాజాపా ఇప్పుడు సొంత‌దారి చూసుకుంటోంది.ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు బంధం ‘అధికారం’ కారణంగా ఓ మోస్తరుగా వుంటే, తెలంగాణలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణం.అధికార పార్టీని నిలువ‌రించ‌డంతో టీడీపీ-భాజాపా విఫ‌ల‌మ‌యిన సంగ‌తితెలిసిందే.అయితే ఇప్పుడు క‌మ‌ళ‌ద‌లం సొంతంగా ఎద‌గాల‌ని చూస్తోంది.

బీజేపీ, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది..ఆపార్టీ ఛీప్ అమీత్‌షా ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చారు.ఇక చేసేది ఏమి లేక టీడీపీ నాయ‌కులు ‘పొత్తుల గురించి అధిష్టానం స్థాయిలో చర్చలు జరుగుతాయి..’ అంటూ చేసేది లేక, తెలంగాణ టీడీపీ నేతలు మీడియా నుంచి తప్పించుకు తిరగాల్సి వస్తోంది.
ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే బాబు అనుకూల వర్గం, ప్రతికూల వర్గం బీజేపీలో కన్పిస్తున్నాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అమిత్‌ షా రాకతో ఇప్పుడు టీడీపీ – బీజేపీ మైత్రీ బంధంపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. 2019 ఎన్నికల్లోపే ఈ బంధం ‘బద్దలైపోవచ్చు’.! ఎందుకంటే, అమిత్‌ షా ఇచ్చిన సంకేతాలు అలాంటివి. ఇక వైసీపీని కూడా భాజాపా త‌న క‌నుస‌న్న‌ల్లో పెట్టుకుంది. మిత్ర ప‌క్షం నుంచి ఏదైనా తేడా వ‌స్తే బ‌బుకు చుక్క‌లు చూపించ‌డం ఖాయం.

{loadmodule mod_custom,Side Ad 1}
ప్ర‌స్తుతానికి ఏపీలో టీడీపీతో పొత్తు కొన‌సాగుతుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు అమిత్ షా. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో కూడా కొన‌సాగ‌బోమనే ప‌రోక్ష సంకేతాలు సంకేతాలు అమిత్‌షా ఇచ్చిన‌ట్లే. టీడీపీని కాదనుకుంటే బీజేపీకి, అసలు ఆంధ్రప్రదేశ్‌లో దిక్కే లేదంటూ మీడియాకెక్కి టీడీపీ నేతలు చేస్తున్న రచ్చభాజాపాకు రుచించ‌డంలేదు.కేంద్రానికి చంద్రబాబు క్రెడిట్‌ ఇవ్వకపోవడం, తానే గొప్ప.. అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడమూ బీజేపీ అధిష్టానానికి మంట‌పుట్టిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 2}
అసెంబ్లీ నియేజ‌క వ‌ర్గాల పుణ‌ర్విభ‌జ‌న‌పై బాబు పెట్టుకున్న ఆశ‌ల‌పై అమీత్‌షా నీల్లు చ‌ల్లారు.విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం జ‌రుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఇది పార్ల‌మెంట్ ప‌రిధిలోని అంశ‌మ‌ని, కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాట్లాడుకుంటాయ‌ని సెల‌విచ్చారు. దీంతో అమిత్ షా ప్రెస్‌మీట్ లో టీడీపీ నేత‌ల‌కు గ‌ట్టి షాకే ఇచ్చారు. ఇవ‌న్నీ చూస్తె త్వ‌ర‌లోనే భాజాపా-టీడీపీ విడాకులు తీసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Also read

  1. చంద్ర‌బాబు ప‌రువు తీస్తున్న తెలుగు త‌మ్ముళ్లు…
  2. బాబునే టార్గెట్ చేసి భాజాపా మ‌హిళా సీనియ‌ర్‌నేత‌..మాజీ మంత్రి
  3. ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు చుర‌క‌లంటించి కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు
  4. బాబుక‌ను భాజాపా పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిందా….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -