ఉయ్యాలవాడ వెనక రాజమౌళి.. అందుకే రాజమౌళి చిరు రహస్య సమావేశం

Chiru And Rajamouli secret meeting

బాహుబలి 2 ఘన విజయంతో ఈ సినిమా దర్శకుడి రాజమౌళికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడూ రాజమౌళి తన తర్వాత సినిమా ఎవరితో తీస్తాడు అనే విషయంపై ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం చిరంజీవి.. రాజమౌళి ఇంటికి వెళ్లి దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపాడు అన్న వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటికే బాహుబలి 2 విషయంలో రాజమౌళిని ఆకాశాన్నికి ఎత్తేసిన చిరు.. ఇంత హడావిడిగా రాజమౌళి ఇంటికి వెళ్లి కలవడం వెనుక సీక్రెట్ ఏంటి అన్న విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో చరణ్ తో కానీ.. బన్నీ తో కానీ రాజమౌళి తదుపరి సినిమా ఉండేలా రాజమౌళి పై ఒత్తిడి చేయడానికి ఇలా చిరు జక్కన్న ని కలిసాడా అన్న పుకర్లు వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న సమచారం మేరకు.. రాజమౌళి చిరంజీవిల రహస్య సమావేశం వెనుక వేరే ఎజెండా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి గ్రాఫిక్స్ విషయంలో అదేవిధంగా సెట్స్ డిజైన్ విషయంలో రాజమౌళి సలహాలను తీసుకోవడానికి చిరంజీవి ఇలా స్వయంగా రాజమౌళి ఇంటికి వెళ్ళినట్లు టాక్. అయితే ఈ విషయాలపై చర్చ జరపడానికి.. ‘ఉయ్యాలవాడ’ దర్శకుడు సురేంద్ర రెడ్డి లేకుండా కేవలం చిరు ఒక్కరే రాజమౌళి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. చిరు.. రాజమౌళి కలవడం వెనక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చిరు చేస్తున్న ఉయ్యాలవాడ చరిత్ర మీకు తెలుసా..?
  2. బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్
  3. రాజమౌళి పిలిచి మరి చాన్స్ ఇస్తే.. తిరస్కరించిన స్టార్స్ వీళ్ళే..
  4. రాజమౌళి 11 సినిమాల కలక్షన్స్ చూస్తే షాక్ అవుతారు