బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్

Chiranjeevi Uyyalavada First Look Release

మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ సినిమాతో ఎలాంటి రికార్డులు సాధించాడో ప్రత్యేంచి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే సినిమా ఇప్పుడు చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు కానీ చిరు లుక్ మాత్రం బయటకు వచ్చేసింది.

కాకపోతే అది అఫీషియల్ లుక్ కాదు. ఓ వీరాభిమాని తయారుచేసిన పోస్టర్. నిజంగా అది ఎంత బాగుందంటే.. పోస్టర్ లో టైటిల్ తెలుగులో ఉంటే కనుక ఇదే నిజమైన ఫస్ట్ లుక్ అని ఎవరైనా ఫిక్స్ అయిపోతారు. 1840 కాలానికి చెందిన కథతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా వస్తోంది.

అభిమాని తయారుచేసిన ఫస్ట్ లుక్ కూడా ఆ కాలానికి చెందిన ఎలిమెంట్స్ ను ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది.. 1847 కాలానికి చెందిన రాయలసీమ గ్రామాన్ని తలపించే విధంగా సెట్ ను నిర్మిస్తున్నారు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వచ్చే అవకాశముంది.

{youtube}1zI-EWuYtVE{/youtube}

Related

  1. జ‌గ‌న్ బాహుబలి అయితే…. లోకేష్ కామెడీ యాక్టర్
  2. పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది
  3. బాహుబలి 2 మూవీలో లోపం ఏంటో తెలుసా..?
  4. బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్