Monday, April 29, 2024
- Advertisement -

చిరు చేస్తున్న ఉయ్యాలవాడ చరిత్ర మీకు తెలుసా..?

- Advertisement -
The real story of Uyyalawada Narasimha Reddy

స్వాతంత్రం కోసం ఎందరో.. ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కొంత మంది గురించే మనకి తెలుసు. త్వరలో మరో వీరుడు గురించి మనం తెలుసుకోబోతున్నాం.

అయనే.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ సినిమా తర్వాత ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన 151 వ సినిమా కోసం ఉయ్యాలవాడ జీవితాన్ని తీసుకున్నారు. ఇంతకి ఉయ్యాలవాడ ఎక్కడి వారు? ఏమి చేశారు? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ఇప్పుడు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను చూద్దాం.. నరసింహారెడ్డి సొంత ఊరు కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. . 18వ శతాబ్దంలో చాలా దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగార్‌ వ్యవస్ధ ఉండేది. ప్రజకను రక్షణగా.. పన్నులు వసూళ్లు.. శాంతి భద్రతలను కాపాడటం.. స్ధానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగివుండేవారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేవారు. 1857 లో సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో చాలా మండి కీలక పాత్ర ఉంది. ఈ తిరుగు బాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుబాటు చేసిన పాలేగార్లకు గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

{loadmodule mod_custom,Side Ad 1}

అందుకే ఉయ్యాలవాడ గురించి పెద్దగా తెలియ లేదు. అయితే సిపాయిల తిరుగుబాటుకు జరగక ముందే తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల పరిపాలనపై తిరుగుబాటు చేసాడు. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులపై తిరుబాటు ప్రకటించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ. సైన్యంతో ఓ బ్రిటీష్‌ స్ధావరంపై దాడి చేసిన నరసింహారెడ్డి బ్రిటీష్‌ సైనికులను అక్కడి నుంచి తరిమికొట్టాడు. దాంతో నరసింహారెడ్డిని అణచివేయాలని అప్పటి బెంగాల్‌ గవర్నర్‌ మార్క్‌ హేస్టింగ్స్ మద్రాస్‌ కలెక్టర్‌ సర్‌ థామస్‌ మన్రోకు ఆదేశాలు జారీ చేశాడు. దాంతో ఉయ్యాలవాడను పట్టుకుని ఆయన్ను బహిరంగంగా ఉరి తీయించారు. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర. మరి చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని ఇలానే తీస్తారో లేక.. కమర్షియల్ హంగుల కోసం మార్పులు చేస్తారో ఇప్పుడే చెప్పలేము. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలు కాబోతుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్
  2. ఈసారి చిరుతో పవర్ స్టార్ హాలీడే ట్రిప్‌.. ఎక్కడికో తెలుసా..?
  3. చిరు.. మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలుసా..?
  4. నాగబాబుని కొట్టిన చిరు.. ఎందుకో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -