- Advertisement -
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రం విడుదలకు ముందే రికార్డు నెలకొల్పింది.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నైజాం రైట్స్ కోసం 14 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్ధ ముందుకొచ్చినట్లు తెలిసింది. మిగతా చోట్ల కూడా ఇదే రేంజ్లో మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. రిలీజ్ అయిన తరువాత హిట్ టాక్ తెచ్చుకుంటే, ఈ చిత్రం 100 కోట్ల మార్క్ సునాయాసంగా క్రాస్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ అంచనా.
