Sunday, May 12, 2024
- Advertisement -

తెల్ల చర్మానికి ఇంటి చిట్కాలు ఇవిగో

- Advertisement -

సహజత్వంతో కూడిన అందాన్ని సొంతం చేసుకోవాలంటే.. పోషక విలువలతో నిండిన కొన్ని పదార్థాలతో ఇంట్లోనే రెమెడీస్ తయారుచేసుకుని అప్లై చేసుకుంటే చాలు! కాంతివంతమైన అందంతోపాటు సహజత్వాన్ని పొందవచ్చు. మరి.. ఆ హోమ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం…

1. ఎండబెట్టిన ఆరెంజ్ తొక్క – పెరుగు మిశ్రమం : ముందుగా ఆరేంజ్ తొక్కలను ఎండలో ఎండబెట్టి… వాటిని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిన ఒక డబ్బాలో నిల్వ చేయాలి. అందులో నుంచి ఒక పొడిని ఒక గిన్నెలో తీసుకుని అందులో పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మీద మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి.

2. కొబ్బరి నూనె : శరీరం మీద మచ్చలు వున్న భాగాలపై ప్రతిరోజూ కొబ్బరి నూనె రాసుకుంటే మంచిది. అలాగే ముఖం మీద కూడా రాసుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే.. మంచి ఫలితం దక్కుతుంది.

3. పాలు-తేనె-నిమ్మరసం : ఒక స్పూన్ పాలు, తేనె, నిమ్మరసం తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మీద మచ్చలు తొలిగి, మృదువుగా మారుతుంది.

4. హనీ-బాదం మాస్క్ : తేనె, బాదం రెండు కలుపుకుని ఒక పేస్ట్ తయారుచేసుకోవాలి. దీనిని చర్మానికి పట్టించి మంచి ఫలితం లభిస్తుంది. ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ పాల పొడి, అర స్పూన్ బాదం పొడి లేదా ఆయిల్ లను బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

5. టమోటా-శనగపిండి మాస్క్ : రెండు స్పూన్స్ శనగపిండిలో రెండు-మూడు స్పూన్స్ నిమ్మరసం, టమోటా రసం కలిపి ముఖానికి పట్టించించుకోవాలి. 20 నిముషాలు అయిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే చర్మం తెల్లబడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -