Monday, May 12, 2025
- Advertisement -

ప్రత్యేక హోదా లేదు.. ఏపీకి జరగబోతున్న నష్టాలు ఇవే… !

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కదు అని స్పష్టం అవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో ఈ విషయం గురించి స్పష్టత వచ్చింది.

రాష్ట్ర విభజనతో ఏపీకి దక్కుతుంది అనుకొన్న ప్రత్యేక హోదా దక్కకపోవడం అనేది తీవ్రమైన ఆన్యాయమే. మరి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏమిటో తెలుసా?! 

ప్రత్యేక హొదా అంటే..

1) రాష్ట్ర బడ్జెట్ లోటును కేంద్రప్రభుత్వం గ్రాంట్ ద్వారా భరిస్తుంది

2) ఎక్సైజ్ సుంకం 100% రాయితీ లభిస్తుంది

3) ఆదాయ పన్ను 100% రాయితీ

4) పెట్టుబడిలో 30% సబ్సిడీ లభిస్తుంది

5) నిర్వహణ మూలధనం(working capital) నిమిత్తం తీసుకున్న రుణాల పై 3% వడ్డీ రాయితీ

6) పారిశ్రమిక సంస్థ చెల్లించిన బీమా ప్రిమియం మెత్తం వాపసు

7) రవాణా ఖర్చుల పై 90% సహాయం లభిస్తుంది

8) గాడ్గిల్ ముఖర్జీ పార్మలా ప్రకారం 30% రాయితీ

9) కేంద్రప్రభుత్వం సంస్థలు నెలకోల్పాడంలో కేంద్రం 90% రాష్ట్రం 10% పెట్టుబడి

10) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికీ ప్రత్యేక ప్యాకేజీ

ప్రత్యేక హోదా కలిగే లాభాలు ఇవి. మరి ఇప్పుడు ఆ హోదా దక్కదు అంటున్నారు కాబట్టి.. ఈ లాభాలు అన్నీ లేనట్టే. అయితే ప్రత్యేక ప్యాకేజీ అంటూ మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. మరి దీనిపై ప్రజా స్పందన ఎలా ఉంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -