Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి.. కారణం అదే !

- Advertisement -

“ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ” అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పడు ఈ స్పెషల్ స్టేటస్ ప్రస్తావన లేదు. కానీ 2014 ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అవశేష ఆంధ్ర ప్రదేశ్ ను అన్నీ విధాలుగా ఆదుకుంటామని అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ఎన్నో హామీలను ప్రకటించింది. ఆ హామీలో భాగంగానే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇక ఆ తరువాత 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రమించడం.. భారత జనతా పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి.

అయితే ఇంతవరకు బాగానే ఉన్న.. కాంగ్రెస్ అదికారంలో ఉన్నప్పుడూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నొక్కి చెప్పింది. తీర బీజేపీ అధికారం చేపట్టిన తరువాత ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో ఎప్పటికప్పుడు మాట దాటివేస్తూ వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని సార్లు అడుగుతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తూ వచ్చింది. ఇక ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

దీంతో ఏపీ ప్రజల్లో స్పెషల్ స్టేటస్ పై ఉన్న ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. అయినప్పటికి ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా విషయాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి పార్లమెంట్ లో లేవనెత్తారు. దాంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ ప్రత్యేక హోదా విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ కి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని, 14 ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా కు ప్రాధాన్యం ఇవ్వదని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని మరోసారి రుజువైంది.

అసలెందుకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే.. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉండాల్సిన భౌగోళిక పరిస్థితులు, ఇతర ఆర్థిక కారణాలు ఏపీ లేవని కొందరు రాజకీయవేత్తలు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఏపీ కంటే వెనుకబడిన రాష్ట్రాలు అనగా బిహార్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్లు వినిపించే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఏపీలో బీజేపీ బలమైన పార్టీ కాదు.. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే ఏపీలో బీజేపీ బలపడుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోది.

More Like This

మోడి కుల రాజకీయాలు చేస్తున్నారా ?

డోర్ డెలివరీ.. ఏంటిది జగన్ సారూ !

మీరు వదిలేస్తే.. మేము సిద్దం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -