Saturday, May 10, 2025
- Advertisement -

ఫ్లాప్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్న మాస్ మహారాజ్

- Advertisement -

రవితేజకి కథ నచ్చితే…దర్శకుల ట్రాక్ రికార్డ్స్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తాడు. దానికి ఉదాహరణ సుధీర్ వర్మే.

ఇతను ‘స్వామిరారా’ సినిమాతో యుంగ్ హీరో నిఖిల్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. దాంతో టాలీవుడ్ హీరోలందరూ సుధీర్ వర్మ వెంట పడినా సరే సుధీర్ మాత్రం నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమాను తీసాడు. అ సినిమా పరాజయం కావటంతో ఈ యంగ్ డైరెక్టర్ ని టాలీవుడ్ పక్కన పెట్టేసింది.

కానీ రవితేజకు సుదీర్ వర్మ చెప్పిన కథ నచ్చటంతో ప్లాప్స్ ని పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. వరుస విజయాలను ఇచ్చిన దర్శకులు ఒక ప్లాప్ ఇస్తే మాత్రం పక్కన పెట్టేసే ఈ రోజుల్లో రవితేజ మాత్రం ప్లాప్ లను పట్టించుకోకుండా దర్శకులను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనతో ‘షాక్’ వంటి ప్లాప్ సినిమాను తీసిన హరీశ్ శంకర్ కు రవితేజ ‘మిరపకాయ’ తో మరల అవకాశం ఇచ్చాడు.

అలాగే ‘అశోక్’, ‘అతిథి’ వంటి రెండు ప్లాప్ సినిమాలతో ఉన్న సురేంద్ర రెడ్డికి ‘కిక్’ ఇచ్చాడు. అర్జున్, సైనికుడు, వరుడు వంటి మూడు ప్లాప్స్ తో ఉన్న గుణశేఖర్ తో దైర్యంగా ‘నిప్పు’ చేసాడు. ఈ విధంగా ప్లాప్ డైరెక్టర్స్ కి మంచి ప్రోత్సాహం అందించాడు మాస్ మహారాజ్ రవితేజ. అయితే ఇప్పుడు సుదీర్ వర్మ రవితేజకి అదిరిపోయే హిట్ ని అందిస్తాడెమో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -