Saturday, May 10, 2025
- Advertisement -

ఒక్కడు మిగిలాడు మూవీ రివ్యూ

- Advertisement -

మంచు మనోజ్ మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక కొత్త కథాంశంతో ‘ఒక్క‌డు మిగిలాడు’ అనే సినిమాతో వచ్చాడు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ : సూర్య (మంచు మ‌నోజ్‌) ఓ యూనివ‌ర్సిటీ స్టూడెంట్. అయితే తన స‌హ విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తారు. అయితే వాళ్ళది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య అని… దీని వెనుక మంత్రి కుమారులు ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళని చట్టానికి పట్టించేందుకు పోరాటం చేస్తుంటాడు. అయితే అనవసరపు కేసులో సూర్య‌ని, అత‌ని ప్రెండ్స్ ని పోలీసులు అరెస్టు చేస్తారు. చంపాల‌ని చూస్తారు. మరి వారి నుంచి ఎలా బయట పడ్డారు ? ఈ సూర్యకి.. పాతికేళ్ల క్రితం శ్రీ‌లంక‌లో యోధుడిగా పోరాటం సాగించిన పీట‌ర్ (మంచు మ‌నోజ్‌)కీ లింక్ ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాలన్సిందే.

విశ్లేషణ : శ్రీ‌లంక‌లో ఎల్ టీ టీ ఈ చ‌రిత్ర‌, అక్క‌డి శ‌ర‌ణార్థుల బాధ‌లు ఈ సినిమా కథ. ఒకే ఎమోష‌న్‌తో సినిమా సాగుతుంది. ఆ ఎమోషన్ ని ప్రేక్షకులు కనెక్ట్ అవుతే సినిమా బాగా నచ్చుతుంది. పీట‌ర్‌గా మ‌నోజ్ న‌ట‌న‌, విశ్రాంతి ముందు జ‌రిగే యుద్ధ స‌న్నివేశాలు, అక్క‌డ పండే ఎమోష‌న్ ఒక్క‌టే ఈ క‌థ‌కి బ‌లం. మ‌నోజ్‌కి ఇది ఒక కొత్త సినిమా అని చెప్పవచ్చు. పీట‌ర్‌గా ఆక‌ట్టుకొన్నాడు. డైలాగ్స్ బాగున్నాయి. ప్ర‌తీ డైలాగ్‌నీ అరుస్తూనే ప‌లికాడు. సూర్య పాత్ర మాత్రం సెటిల్డ్‌గా ఉంటుంది. అనీషా ఆంబ్రోస్ ఓ పాత్ర అంతే. క‌థానాయిక కాదు. ఈ సినిమాలో క‌థానాయిక అనే పాత్రే లేదు. ద‌ర్శ‌కుడు అజ‌య్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తాడు. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న పాయింట్ మంచిదే. కాస్త హింస త‌గ్గించి.. వాస్త‌విక కోణంలో చెప్పి ఉంటే బాగుండేది. నేప‌థ్య గీతంగా వినిపించిన విషాద గీతం బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది. మొత్తానికి మనోజ్ ఒక కొత్త కథతో ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు.
ప్లస్ పాయింట్స్ :
మనోజ్
కథనం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
హింస ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది
అన్ని వర్గాల వారికి నచ్చకపోవచ్చు

మొంతంగా : మనోజ్ నటన కొత్తరంగా చేసాడు.. కొత్త కథను తో వచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -