Saturday, May 4, 2024
- Advertisement -

‘ 7 ‘ సినిమా రివ్యూ

- Advertisement -

నటీనటులు: హవీష్, రెజీనా, నందితా శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజిత పొన్నాడ, రెహమాన్, సత్య తదితరులు
కూర్పు: ప్రవీణ్‌ కెఎల్‌
సాహిత్యం: శ్రీమణి, పులగం చిన్నారాయణ, శుభం విశ్వనాథ్
సంగీతం: చైతన్ భరద్వాజ్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత: రమేష్ వర్మ
ఛాయాగ్రహ‌ణం, దర్శకత్వం: నిజార్ ష‌ఫీ
నిర్మాణ సంస్థ: రమేష్ వర్మ ప్రొడక్షన్
విడుదల: 06-06-2019

హవీష్ తెలుగు సినిమా పరిశ్రమ లో నువ్విలా సినిమా తో పరిచయం అయ్యాడు కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత ఓంకార్ దర్శకత్వం లో జీనియస్ సినిమా తో అందరినీ మెప్పించే ప్రయత్నం చేసాడు కానీ అది కూడా ఆశించిన స్థాయి లో ఆడలేదు. అలా ఒక్కో సినిమా చేసుకుంటూ తన ప్రతిభ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు హవీష్.ఇప్పుడు తాజాగా 7 అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా లో రెజీనా, నందితా శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా నటించారు. నిజార్ ష‌ఫీ ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళం లో కూడా విడుదల కాబోతుంది.

కథ:
ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం చేసుకొనే కార్తిక్ (హవీష్) తన కొలీగ్ రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొద్దీ రోజులకి వాళ్ళ ఇద్దరికీ గొడవ జరిగి కార్తిక్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎప్పటికీ తిరిగి రాకపోవడం తో రమ్య వెళ్ళి తన భర్త మిస్సింగ్ అయ్యాడు అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు తెలుసుకొనేది ఏంటి అంటే కార్తిక్ ఒక చీటర్ అని ఇంతకు ముందు కూడా చాలా మంచి అమ్మాయిలను ఇలా నే మోసం చేసాడు అని. పోలీస్ ఆఫీసర్ (రెహమాన్) ఈ కేసు ని డీల్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే వాళ్ళు కార్తిక్ అసలు పేరు కార్తిక్ కాదు అని, ఇంతకు ముందు ఎప్పుడో చనిపోయాడు అని తెలుసుకొని షాక్ అవుతారు. అసలు కార్తిక్ ఎవరు? అతని కథ ఏంటి? ఈ అమ్మాయిలని చీట్ చేయడం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల ప్రతిభ:
ఈ సినిమా లో హీరోయిన్లు తమ గ్లామర్ డోస్ తో అందరినీ మంత్రం ముగ్ధుల్ని చేశారు. రెజినా పాత్ర అందరి కన్నా బాగా డిజైన్ చేయబడింది. ఒక వైపు అందం,మరో వైపు అభినయం తోడయి ఆ పాత్ర బాగా వచ్చింది. ఎమోషన్స్ కూడా రెజీనా బాగా పలికించింది.ఇక హవీష్ నటన కూడా బాగానే ఉంది అనిపిస్తుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే హవీష్ ఈ చిత్రం లో బాగా చేసాడు అనిపిస్తుంది. నందితా శ్వేత పాత్ర బాగుంది.అలాగే అనీషా ఆంబ్రోస్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ ఇద్దరు కూడా హీరో తో మంచి కెమిస్ట్రీ మైంటైన్ చేశారు. పోలీస్ అధికారిగా రెహమాన్ నటన ఆకట్టుకుంది. త్రిధా చౌదరి పాత్ర చాలా చిన్నది కానీ తన పరిధి మేరకు బాగానే చేసాడు. అదితి ఆర్య కూడా తన అందం తో మెప్పించింది. అందరూ హీరోయిన్లకు పెర్ఫర్మ్ చేసే స్కోప్ లేకున్నా వారు తమ అందం తో ఆకట్టుకున్నారు. కామెడీ పాత్ర ని చేసిన సత్య పర్వాలేదు అనిపించాడు.

సాంకేతిక నిపుణుల పనితనం:
ఈ సినిమా కి నిజార్ షఫీ ఛాయాగ్రహకుడిగా పని చేసాడు. తనదైన శైలి లో కెమెరా పనితనం తో ఆకట్టుకున్నాడు. విజువల్స్ ఈ సినిమా లో చాలా బాగున్నాయి. చైతన్ భరద్వాజ్ స్వరాలు ఈ సినిమా కి పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా బాగా ఉపయోగపడించి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా లో సంభాషణలు బాగున్నాయి. సందర్భానుసారం గా సంభాషణల ని రాసుకున్నారు కానీ రక్తికటించే కథ ని చెప్పడం లో మాత్రం దర్శకులు విఫలమయ్యారు. నటీనటుల తో ఇంకా బాగా పెర్ఫర్మ్ చేయించి సీన్ పండేలా చేయకపోవడం తో సీన్లు అన్ని పేలవం గా అనిపిస్తాయి. చెప్పాలి అనుకున్న ఎమోషన్ సంపూర్ణం గా చెప్పకపోబవడం తో ఒక అసంతృప్తి ఉంటుంది. నిర్మాణ విలువల ని మాత్రం నిర్మాతలు బాగా మైంటైన్ చేశారు. సినిమా క్వాలిటీ బాగుంది.

సమీక్ష:
ఈ సినిమా పైకి రొమాంటిక్ కథ లాగా కనిపిస్తున్నా కానీ సినిమా లో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ బాగానే ఉన్నాయి. దర్శకుడు ఆ విషయం లో ఏ మాత్రం తగ్గలేదు. కాకపోతే కథ ని ఆసక్తికరం గా చెప్పడం లో మాత్రం విఫలమయ్యాడు. ఒక మంచి స్క్రీన్ ప్లే ని కూడా డిజైన్ చేయలేకపోయాడు,అందుకే సినిమా లో సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. మంచి ట్విస్ట్స్ ని పెట్టక,వాటిని రివీల్ చేసేందుకు ఆసక్తికరమైన నరేషన్ ఇస్తారని ఆడియన్స్ ఎదురు చూస్తారు కానీ ఎందుకో ఆ నరేషన్ మిస్ అవుతుంది సినిమా లో. కామెడీ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ సినిమా లో కాస్త కొత్తదనం అయితే కనిపించింది. ఇదే కథ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఉంటె చాలా బాగుండేది. అంతే కాకుండా కొన్ని సీన్లలో అసలు లాజిక్స్ ఏ ఉండవు.ప్రేక్షకుల కి బాగా చికాకు వచ్చే సీన్లు కూడా ఉన్నాయి. రొమాంటిక్ థ్రిల్లర్ గా చేయబడిన ఈ చిత్రం లో రొమాన్స్ బాగానే ఉంది కానీ కావాల్సినంత థ్రిల్ అయితే మిస్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -