Thursday, May 9, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ ప్రమోషన్లకు రావట్లేదే?

- Advertisement -

యువ హీరో హవీష్ ‘7’ అనే సినిమాతో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా కసాండ్రా, త్రిధ చౌదరి, అనీషా అంబ్రోస్, నందిత శ్వేత, అదితి ఆర్య, పూజిత పొన్నాడ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంటే ఈ సినిమాలో హీరో ఆరుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు అనమాట. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. అయితే ఇప్పటిదాకా ‘రంగస్థలం’ సినిమాలో కనిపించిన పూజిత పొన్నాడ తప్ప మిగతా హీరోయిన్లు మాత్రం ప్రమోషన్లలో అసలు కనిపించటం లేదు.

పేరుకి సినిమాలో 6 హీరోయిన్లు కానీ ఒక్కరు కూడా సినిమా ప్రమోషన్స్ పై ఆసక్తి చూపట్లేదు. ఈ సినిమాలో ముఖ్య హీరోయిన్ అయిన అదితి ఆర్య కూడా ప్రమోషన్ల కి హాజరు కాకపోవడం గమనార్హం. మిగతా హీరోయిన్లు రెజినా, త్రిధ, అనీషా, మరియు నందిత కూడా ప్రమోషన్ల జోలికి రావడం లేదు. అంత మందిని ప్రమోషన్ లోకి తీసుకు రావాలి అంటే నిర్మాతలకు బాగా డబ్బు ఖర్చు అవుతుందని, ఫ్లైట్ టికెట్ లు మరియు హోటల్ లాడ్జింగ్ అని ఎక్స్ట్రా ఖర్చులు ఎందుకని వారిని పిలవలేదని కొందరు చెబుతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 6న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -