పెళ్ళిచూపులు తరహా చిత్రమవుతుందని భావించిన మెంటల్ మదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ ట్రెండ్ సెట్ గా ఉంటుందని బావించిన వారందరికీ ఈ సినిమా అంత గొప్పగా ఆనలేదు.కాని సినిమా మాత్రం ఫీల్ గుడ్ మూవీగా అందరినీ అలరించింది. ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ కనిపించకుండా దర్శఖుడు ఎంతో తెలివిగా …సినిమాను చుట్టేశాడు . ఈసినిమాలో హీరోకి ఉండే కన్ఫ్యూజన్ చిత్రానికి మంచి ఆయువుపట్టుగా మారింది. బేసికల్లీ బయటకూడా శ్రీవిష్ణు అదే తరహా వ్యక్తి కావడంతో మెంటల్ మదిలో మంచి మార్కులు వేయించుకుంది.
హీరోయిన్లుగా చేసినా నివేతా పేతురాజు,రేణులు సైతం చక్కని నటనను కనబర్చారు. మనకు తెలిసిన వ్యక్తులకు జనరల్ గా జరిగే చిన్నపాటి పెళ్లి సమస్యలను మెంటల్ మదిలో చిత్రంలో చక్కగా ఇరికించారు అయితే అంతా అంటున్నట్లు నిర్మాత రాజ్ కందుకూరి భావించినట్లు…ఈసినిమా ఎక్కడా పెళ్ళి చూపులు స్థాయి చిత్రమైతే కాదు. బట్ మంచి సినిమా. సక్సెస్ టాక్ రావడంతో ఫిలింకు సాలిడ్ టాక్ వచ్చింది. ఇక సురేష్ ప్రొడక్షన్ హ్యాండ్ కూడా ఉంది కాబట్టి…థియేటర్లు ఎక్కువగా దొరకడంతో మూవీకి వసూల్లు ఓ స్థాయిలో రావచ్చని ఆశించవచ్చు.