పాగల్ పరేషాన్.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూలు చేయాలంటే..!

- Advertisement -

థియేటర్లు తెరుచుకున్న తర్వాత అంతో ఇంతో అంచనాలతో, అధిక థియేటర్లలో విడుదలైన సినిమా పాగల్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. దిల్ రాజు సమర్పించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాగల్ సినిమా హిట్ కాకుంటే తన పేరు మార్చుకుంటానంటూ.. విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడంతో పాగల్ సినిమాలో కచ్చితంగా విషయం ఉంటుందని ప్రేక్షకులు భావించారు.

కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత నెగటివ్ టాక్ వచ్చింది. పాగల్ మూవీ థియేట్రికల్ రైట్స్ 6.5 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. వీకెండ్, సండే హాలిడే తో ఈ సినిమాకు కలెక్షన్లు పరవాలేదనిపించే స్థాయిలోనే వచ్చాయి. మూడు రోజులకు గాను దాదాపు 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ కలెక్షన్లు సినిమా విజయానికి సరిపోవు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరాలంటే కనీసం రూ. 7 కోట్లు వసూళ్లు సాధించాలి.అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడం, వచ్చే శుక్రవారం శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజ రాజ చోర, సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కనబడుటలేదు సినిమాలతో పాటు మరో నాలుగు సినిమాలు విడుదల అవుతుండటంతో చాలా థియేటర్లలో పాగల్ సినిమాను ఎత్తివేసే అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకులు కూడా కొత్తగా విడుదలైన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. దీనివల్ల పాగల్ సినిమాకు కలెక్షన్లు తగ్గనున్నాయి. ఈ లెక్కన శుక్రవారం లో పాగల్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమనే అంటున్నారు.

Also Read: ‘భీమ్లా’ తుఫాన్.. ఇప్పట్లో తీరం దాటేలా లేదు..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -