Friday, April 26, 2024
- Advertisement -

నివేతా పేతురాజ్‌కు బంపర్ ఆఫర్

- Advertisement -

మెంటల్ మదిలో, అల వైకుంఠపురములో, రెడ్ లాంటి చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన నటి నివేతా పేతురాజ్. అందం, అభినయం కలగలిపిన నివేతా ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్ చూపిస్తుంది. తాజాగా నివేతా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చిరు 154వ చిత్రంగా వస్తోన్న ఈ సినిమా వాల్తేర్ షిప్ యార్డ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నివేతా పేతురాజ్‌కు అవకాశం వరించిందని సమాచారం. ఇందులో ఆమె రవితేజ సరసన నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారికంగా ఓ ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.

ఇందులో చిరు తమ్ముడిగా ఓ ప్రత్యేక పాత్రలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆయన సరసన నివేదా పెతురాజ్ కథానాయికగా నటించనుందని సమాచారం. పక్కా మాస్ కథాంశంతో మెగా అభిమానులకు కావల్సిన అన్ని మసాలా అంశాల్ని పుష్కలంగా దట్టించిన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. దీనికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -