చిరు 154వ చిత్రానికి రంగం సిద్ధం

- Advertisement -

ఒకరు మెగాస్టార్ .. మరొకరు మాస్ మహారాజ.. ఆ ఇద్దరు కలిసి నటిస్తే.. ఆ లుక్కే వేరబ్బా.. వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ మూవీ త్వరలో పట్టాలెక్కబోతోంది. డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికిది 154వ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ మూవీలో చిరంజీవికి రవితేజ తమ్ముడి పాత్రలో నటించబోతున్నాడు. సెకండ్ హాఫ్‌లో రవితేజ ఎంట్రీ ఉండబోతోందని తెలుస్తోంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతున్న ఈ పాత్ర చనిపోతుందని సమాచారం. ఆ తర్వాత చిరంజీవి పాత్రలో మార్పు వస్తుందని అంటున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తుండగా రవితేజాకు జోడిగా నివేతా పేతురాజ్ కనిపించబోతోంది. మాస్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

బీస్ట్ డైరెక్టర్‌పై విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -