ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ కు ‘అజ్ఞాతవాసి’తో ఓ భారీ విజయాన్ని ఇవ్వాలని చాలా గట్టిగా కృషి చేసి విఫలమయ్యారుత్రివిక్రమ్. ఎన్నో భారీ అంచనాలతో వచ్చి అజ్ణాత వాసి మూవీ బాక్సాఫీసు దగ్గర ఘోరంగా విఫలం అవడంతో తీవ్ర నిరాశలో కూరకుపోయారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
ఈ తరునంలో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి ఓదార్చారట. టాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనేనన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరింత నిరాశలోకి త్రివిక్రమ్ వెళ్లకుండా, ఫోన్ చేసిన ఎన్టీఆర్, జయాపజయాలు చాలా కామన్ అని, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోవద్దని అనునయించాడట. మన సినిమాపై దృష్టి పెట్టాలని, అది కచ్చితంగా హిట్ అవుతుందని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కవచ్చని చెప్పాడట.
