- Advertisement -

త్రివిక్ర‌మ్‌కు ఎన్టీఆర్ ఫోన్‌….ఏం చెప్పాడు…?

- Advertisement -

ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ కు ‘అజ్ఞాతవాసి’తో ఓ భారీ విజయాన్ని ఇవ్వాలని చాలా గట్టిగా కృషి చేసి విఫలమ‌య్యారుత్రివిక్రమ్. ఎన్నో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి అజ్ణాత వాసి మూవీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఘోరంగా విఫ‌లం అవ‌డంతో తీవ్ర నిరాశ‌లో కూర‌కుపోయారు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌.

ఈ త‌రునంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌కు ఫోన్ చేసి ఓదార్చార‌ట‌. టాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనేనన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరింత నిరాశలోకి త్రివిక్రమ్ వెళ్లకుండా, ఫోన్ చేసిన ఎన్టీఆర్, జయాపజయాలు చాలా కామన్ అని, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోవద్దని అనునయించాడట. మన సినిమాపై దృష్టి పెట్టాలని, అది కచ్చితంగా హిట్ అవుతుందని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కవచ్చని చెప్పాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -