Monday, May 13, 2024
- Advertisement -

బౌల్ట్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌….

- Advertisement -

న్యూజిలాండ్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బోల్ట్‌ ధాటికి విలవిడలాడిన పాకిస్తాన్‌.. 0-3 తేడాతో సిరీస్‌ను సమర్పించుకుంది. శనివారం డునెదిన్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్‌ విసిరిన 258 పరుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన పాక్‌.. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక 74 పరుగులకే కుప్పకూలింది. తద్వారా వన్డే చరిత్రలో పాక్‌ తన రెండో అత్యల్ప స్కోరును సమం చేసింది.

డ్యునెడిన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. బదులుగా పాక్ జట్టు 27.2 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆతిథ్య జట్టు 183 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వన్డేల్లో పాకిస్థాన్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గత పాతికేళ్లలో ఓ వన్డే మ్యాచ్‌లో పాక్ జట్టు ఇంత తక్కువ స్కోరుకే పరిమితం కావడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌పై వంద పరుగుల్లోపు పాక్ ఆలౌట్ కావడం కూడా ఇదే ప్రథమం.

కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. 7.2 ఓవర్లలో బౌల్ట్ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. ఓ దశలో పాక్ 32 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కానీ చివరి వికెట్‌కు హసన్ అలీ (14), రుమన్ రాయిస్ (16) జోడి 22 పరుగులు జోడించింది. దీంతో పాక్‌ 74 పరుగులైనా చేయగలిగింది. ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌ 73, రాస్‌టేలర్‌ 52 పరుగులతో రాణించారు. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ 45 పరుగులు, మిడిలార్డర్‌లో వచ్చిన లాథమ్‌ 35 పరుగులు సాధించారు. పాక్‌ బౌలర్లలో రయీస్‌, హసన్‌ అలీలు చెరో 3 వికెట్లు పడగొట్టగా, షబాబ్‌ 2, అష్రాఫ్‌ ఒక వికెట్‌ నేలకూల్చారు.

వన్డేల్లో పాక్ అత్యల్ప స్కోర్లు:

వెస్టిండీస్‌పై 1993లో 43 పరుగులకే ఆలౌట్. * వెస్టిండీస్‌ చేతిలో అదే ఏడాది 71 పరుగులకే ఆలౌట్ * ఇంగ్లాండ్ చేతిలో 1992లో 74 పరుగులకు ఆలౌట్. ఈ రికార్డును పాక్ కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సమం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -