Thursday, May 9, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..భార‌త జ‌ట్టులో మూడు మార్పులు…

- Advertisement -

సెంచూరియన్ వేదికగా భారత్‌తో ఆరంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన మూడు మార్పులతో బరిలో దిగింది.

దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్ బదులు లుంగి ఎన్గిడి టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మొదటి టెస్టులో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ధావన్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు చోటు కల్పించారు. వికెట్ కీపర్‌గా సాహా స్థానంలో పార్థీవ్ పటేల్‌కు అవకాశం లభించింది.

తొలి టెస్టు జరిగిన న్యూలాండ్స్ పిచ్‌తో పోలిస్తే సెంచూరియన్‌లో బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్ స్వింగ్‌కు అంతగా అనుకూలించకపోవచ్చు. దీంతో భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇశాంత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా, మొదటి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ రోహిత్ శర్మకు మరో అవకాశం ఇవ్వాలని కోహ్లి నిర్ణయించాడు. దీంతో విదేశాల్లో మెరుగైన బ్యాటింగ్ రికార్డ్ ఉన్న రహానే బెంచ్‌కే పరిమితమయ్యాడు.

సెంచూరియన్ పార్క్‌లో ఉపఖండ జట్లు 8 టెస్టులు ఆడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ సఫారీ జట్టే గెలుపొందింది. చివరి నాలుగు టెస్టుల్లో దక్షిణాసియా జట్లపై సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయాలు సాధించడం గమనార్హం.

జట్లు
భారత్‌: రాహుల్‌, విజయ్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), ఆర్‌జీ శర్మ, పాండ్యా, పార్ధీవ్‌ పటేల్‌, ఆర్‌ అశ్విన్‌, షమీ, బుమ్రా, ఇషాంత్‌ శర్మ.
దక్షిణాఫ్రికా: ఎల్గర్, మార్క్‌రమ్, ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), డికాక్, ఫిలాండర్, క్రిస్‌ మోరిస్, కేశవ్‌ మహరాజ్, రబడ, మోర్నీ మోర్కెల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -