వీవీ వినాయక్ దర్వకత్వంలో వస్తున్న సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అక్కినేని అఖిల్.
హీరో నితిన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఒక సినీ కుటుంబం నుంచి వస్తున్న కుర్రాడి తొలి సినిమాను మరో హీరో నిర్మించడం టాలీవుడ్ వరకూ చాలా కొత్త! నితిన్ కుటుంబానికి నిర్మాణ నేపథ్యం ఉండటంతో.. ఈ సినిమా పై అభిమానులకు కూడా మంచి గురి కుదిరింది.
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాలో నితిన్ అలా మెరవనున్నాడని మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే.. ఈ సినిమాలో అతిధి పాత్రలో మెరవబోయేది నితిన్ కాదట! అక్కినేని నాగాచైతన్య ఈ సినిమాలా అలా మెరవనున్నాడని సమాచారం.
తన తమ్ముడు ఇంట్రడ్యూస్ అవుతున్న సినింమాలో చైతూ కనిపించి వెళ్లనున్నాడట. మొదట నితిన్ ఆ పాత్రను చేద్దాం అనుకొన్నాడట కానీ.. చైతూ అయితే.. అన్నదమ్ముల గాఢత బాగుంటుందని.. ఆ అవకాశాన్ని అతడికే ఇచ్చారట. మరి అన్నదమ్ముల కాంబో ఎలా ఉంటుందో!