బీజేపీ లో బీహార్ ఓటమికి సంబంధించిన ప్రకంపనలు ఒక పట్టాన సర్డుమణిగేలాగా కనపడ్డం లేదు. పార్టీ అగ్రనేతలు అయిన ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషీ – అరుణ్ శౌరీ – అనంతకుమార్ లు ఓటమి కి బాధ్యులని తేల్చాలని డిమాండ్ చేస్తున్న తరుణం లో వ్యక్తిగతంగా ఎవ్వరినీ బాధ్యులని చేయలేమంటూ అమిత్ షా వంటివారి తప్పించుకునే ప్రయత్నాల్లో బిజీ గా ఉన్నారు.
బీజేపీ వెలిగిపోతోంది అని తిరుగులేదు అని చెప్పిన నేతలు ఇప్పుడు ఓటమి విషయం లో మౌనంగా ఉండి ఎవరి మీదా ఆ నిందపడకూడదు అని ఎందుకు అనుకుంటున్నారు అని, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని ఎంపీ మనోజ్ తీవారీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీకి అంతా బాగుందనుకునే సమయంలో ఘోర పరాజయం ఎలా జరిగిందో కనుక్కోవాలని డిమాండ్ చేశారు. తివారీ తీవ్ర స్వరానికి మరో ఎంపీ ఆర్కే సింగ్ మద్దతు పలికారు.
ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా ఎలా ముందుకు వెళ్ళగలం అనేది ఆయన ప్రశ్న.ఇప్పటికే సీనియర్ లు అసహనంతో ఉండగా సీనియర్ ఎంపీ లు తివారీ – ఆర్కే సింగ్ లు తెరమీదకి వచ్చి మరీ రాచ్చయ్యడం బీజేపీ కి మింగుడు పడని విషయం. మొత్తానికి బీహార్ ఎన్నికలు అడ్డం పెట్టుకుని బీజేపీ లో మోడీ వ్యతిరేకులు, అద్వానీ సపోర్టర్ లూ బయటపడుతున్నారు.