Saturday, May 10, 2025
- Advertisement -

పురుటినొప్పులు భ‌రించింది… కాని బిడ్డ ఏడుపును భ‌రించ‌లేక చంపేసింది క‌న్న త‌ల్లి…

- Advertisement -

నవమాసాలు మోసింది. పురిటి నొప్పులు కూడా భరించింది. పుట్టిన బిడ్డ ఏడుపును మాత్రం భరించలేకపోయింది. గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుతో కన్న ప్రేమను మరిచి గుట్టుచప్పుడు కాకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసింది. ఈ దుర్ఘ‌ట‌న ఢిల్లోలో చోటు చేసుకుంది.

దక్షిణ ఢిల్లీలోని వినోద్‌ నగర్‌ కు చెందిన 25 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పసికందు వేళపాళలేకుండా ఏడుస్తుండడాన్ని ఓర్చుకోలేకపోయిన ఆ మహిళ కన్నబిడ్డను అత్యంత కర్కశంగా ఊపిరాడకుండా చేసి చంపి అనంతరం పసికందును చెత్తకుండీలో వేసి చేతులుదులుపుకుంది. పాప కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులంతా కంగారుపడగా.. తాను కూడా వారితోపాటు వెతికినట్లు నటించింది.

ఈ క్రమంలో సాక్ష్యులను విచారణ చేపట్టగా స్థానికుడొకరు నేహ చెత్తకుండీలో ఏదో మూట పడేయటం చూశానని చెప్పాడు. దీంతో పోలీసులకు ఆ తల్లిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె నేరం ఒప్పుకుంది.

దీంతో పోలీసులు హుటాహుటినా చెత్త కుప్ప వద్దకు వెళ్లారు. కొన ఊపిరితో ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించి బతికించే ప్రయత్నం చేశారు. అయితే తలకు బలమైన దెబ్బ తలగటంతో ఆ పసికందు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో పోలీసులు నేహను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన బాలల హక్కుల కమిషన్‌ ప్రధాన అధికారి జుబేదా సింగ్‌, కన్నబిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -