Saturday, May 10, 2025
- Advertisement -

ఎర్రబెల్లి కోసం.. ఎవరు బలవుతున్నారు?

- Advertisement -

టీడీపీ శాసనసభాపక్ష నాయకుడిగా పని చేసిన సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి.. తెలంగాణలో అధికార పార్టీ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి.

పార్టీలో ఎర్రబెల్లికి కీలక స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. ఈ క్రమంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఎర్రబెల్లితో పాటు.. అత్యవసరంగా ఓ మహిళా ఎమ్మెల్యేకూ కేబినెట్ లో స్థానం కల్పించాలన్నది సీఎం ఆలోచనగా సమాచారం అందుతోంది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం.. వెటరన్ మంత్రి.. హోం శాఖ బాధ్యతలు చూస్తున్న నాయిని నర్సింహారెడ్డికి పదవి ఊడడం ఖాయమని వార్తలందుతున్నాయి. ఆయనతో పాటు.. జూపల్లి కృష్ణారావు.. చందూలాల్ ను కూడా పదవి నుంచి తప్పిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

చందూలాల్ స్థానంలో ఓ గిరిజన ఎమ్మెల్యేకు.. నాయిని స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేకు (అవసరమైతే వేరే పార్టీ నుంచి చేర్చుకుని అయినా!).. జూపల్లి పోస్టును ఎర్రబెల్లికీ అప్పగించే అవకాశాలు ఉన్నట్టు.. తమకు ఉన్న సమాచారం ఆధారంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. ఎర్రబెల్లి రాక.. ముగ్గురి మంత్రుల పోక.. ఒకేసారి అన్న ఫీలింగ్ పార్టీ వర్గాల్లో కలిగే చాన్స్ ఉందని కూడా విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -