Monday, April 29, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ కు ఈసారి ఎన్నికలు కత్తి మీద సామే !

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన మొదటి ఎన్నికల్లో అనగా 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చింది కే‌సి‌ఆరే అనే నినాదంతో ప్రజలు రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను సైతం కాదని టి‌ఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు టి‌ఆర్‌ఎస్ కు తెలంగాణలో వేరే పార్టీ పోటీ లేదు రాదు.. అన్నట్లుగా సాగింది. 2018 ఎన్నికల్లో కూడా ప్రజలు కే‌సి‌ఆర్ నాయకత్వనే జై కొట్టారు. అయితే తెలంగాణ ప్రజలు టి‌ఆర్‌ఎస్ ను అంతలా నమ్మడానికి కారణం కూడా లేకపోలేదు. కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ.. అటు అభివృద్ది ఇటు సంక్షేమం రెండిటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేశారు కే‌సి‌ఆర్ దీంతో తెలంగాణ అంటే టి‌ఆర్‌ఎస్ అనే బలమైన ముద్ర వేయడంలో కే‌సి‌ఆర్ సక్సస్ అయ్యారు..

అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. రాబోయే ఎన్నికలు కే‌సి‌ఆర్ కు కత్తి మీద సామే అయ్యే లాగే ఉన్నాయి. ఎందుకంటే రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి. పేరుకే ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్న ప్రజలకు పూర్తిగా చేరవేయడంలో టి‌ఆర్‌ఎస్ విఫలం అవుతుందనే వాదనలు కూడా పెరిగిపోయాయి. ఫలితంగా తెలంగాణ ప్రజల్లో టి‌ఆర్‌ఎస్ హవా తగ్గుతుందనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. అదే టైమ్ లో టి‌ఆర్‌ఎస్ కు అల్ట్రానేటివ్ గా బీజేపీ దూసుకొచ్చింది. దాంతో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కమలదళం సరికొత్త వ్యూహాలు రచిస్తూ సత్తా చాటుతోంది.

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లోనూ, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ టి‌ఆర్‌ఎస్ కు షాక్ ఇస్తూ బీజేపీ సత్తాచాటింది. ఇక ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచినంత పని చేసింది. దీన్ని బట్టి చూస్తే ప్రజల దృష్టి మెల్లగా టి‌ఆర్‌ఎస్ నుంచి అల్ట్రానేటివ్ పార్టీల వైపు మల్లుతోందనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న చర్చ. దాంతో ఈసారి ఎన్నికలు గతంలో మాదిరిగా నల్లేరు మీద నడక లా సాగడం కష్టమని తెలుస్తోంది. కాగా ఎన్నికలకు కరెక్ట్ గా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ ముచ్చటగా మూడవసారి అధికారం చేపట్టాలన్నా, రైజింగ్ పార్టీగా ఉన్న బీజేపీకి షాక్ ఇవ్వాలన్నా అంతా ఈజీ కాదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి గులాబీ బస్ ఈసారి ఎన్నికల్లో గెలిచిఎందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు ? ప్రజలను ఏవిధంగా ఆకర్షిస్తారు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

ఒక్క ఛాన్స్ అంటే నమ్మి.. మోసపోయాం !

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -