Friday, May 17, 2024
- Advertisement -

రాజకీయాల్లోకి బాలయ్య చిన్నల్లుడు..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో విశాఖపట్నం ఓక్కటి. ఇక్కడ మొదట నుంచి బయట నుంచి వచ్చి పోటీ చేసిన అభ్యర్దులకే పెద్దపీట వేస్తూ వచ్చారు విశాఖ వాసులు.. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినిగా పోటీపడ్డ విజయమ్మను ఓడించి, బీజేపీకి చెందిన హరిబాబుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు విశాఖ నియోజకవర్గం పై గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి కన్నేసాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని భర్త భరత్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. తన వారసుడిగా మనవడైన భరత్ కు సీటు ఇవ్వాలని ఎంవీవీఎస్ మూర్తి తెలుగుదేశం పార్టీని కోరినట్టు సమాచారం.

అయితే ఈ ప్రాంతంలో మంచి పట్టున్న నేతగా ఉన్న గంటా శ్రీనివాస్ ను అసెంబ్లీకి బదులుగా లోక్ సభకు పంపాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లుడికే సీటు ఇవ్వాలని బాలయ్య కూడ గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఇక లోకేష్ కు తోడుగా తన చిన్నల్లుడు భరత్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలయ్య అసిస్తున్నట్టు తేలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -