Monday, April 29, 2024
- Advertisement -

ఆపరేషన్ బాలయ్య..టీడీపీకి షాక్ తప్పదా?

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరంలో సీఎం జగన్ తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. రెండోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలుకోవడానికి సిద్ధంగా లేరు జగన్. అందుకే నియోజకవర్గాల వారీగా గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. అలాగే టీడీపీ కీలక నేతలను ఓడించి సత్తాచాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ని ఓడించేందుకు మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించిన జగన్..అలాగే బాలయ్యతో పాటు మరికొంతమంది నేతల నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో వైసీపీ జెండాను పాతాలని భావిస్తున్నారు జగన్. 1983 నుండి హిందూపుర్‌లో గెలుస్తూ వస్తోంది టీడీపీ. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ మూడు సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలవగా హరికృష్ణ ఒకసారి, బాలయ్య రెండు సార్లు విజయం సాధించారు. ఈసారి కూడా హిందూపుర్ బరిలో బాలయ్య నిలవగా హ్యాట్రిక్ కొట్టేందుకు తన ప్లాన్‌లో ఉన్నారు.

వైసీపీ తరపున కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను అభ్యర్థిగా ప్రకటించారు జగన్. అలాగే దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు. దీంతో వీరంతా కేడర్‌ను కలుపుకుని తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా గ్రూపు రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కేడర్‌ అంతా ఒకే తాటికి చేర్చడంలో తనదైన పంథాను అమలు చేస్తున్నారు పెద్దిరెడ్డి. అలాగే వైసీపీ నేతలు నవీన్ నిశ్చల్‌, చౌళూరు వర్గీయులు దీపికకు మద్దతు పలుకున్నారు. గత ఎన్నికల్లో గ్రూప్ వార్‌తో ఈ సీటును కొల్పోగా ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తున్నారు. హిందూపేర్‌లో కురవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సారి పసుపు కోటను బద్ధలు కొడతానని తేల్చిచెబుతున్నారు దీపిక. మొత్తంగా ఈసారి హిందూపురం రాజకీయాలు ఆసక్తికరంగా మారగా ఓటర్లు ఎవరికి జై కొడతారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -