మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుపుకుంటుంది. అరవింద సమేతలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశాడు త్రివిక్రమ్.జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి,రెండు సినిమాలు చేశాడు త్రివిక్రమ్. జులాయి హిట్ కాగా సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్‌గా ఆడింది.
ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లుకు బన్నీతో సినిమా చేయలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ బన్నీకి ఒక కథ చెప్పడని,బన్నీ అందులో కొన్ని మార్పులు చెప్పడని తెలుస్తుంది. ఎన్టీఆర్‌తో సినిమా పూర్తి అవ్వగానే బన్నీతో సినిమా మొదలు పెడతాడని సమాచారం. బన్నీ కూడా ఈలోపు విక్రమ్ కుమార్ తో సినిమాను పూర్తి చేసేసి త్రివిక్రమ్ సినిమాకు రెడీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్-బన్నీ సినిమాపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.