అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండకు యూత్‌లో బాగా ఫాలోయింగ్ పెరిగింది.విజయ్ దేవరకొండ తాజా చిత్రం గీతా గోవిందం ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే విదేశాలలో విడుదలైన ఈ సినిమాపై కొందరు ట్వీట్టర్ ద్వారా తమ అభిప్రాయలను తెలుపుతున్నారు.ఇప్పటికే యూఎస్ ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి.
అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కామెడీ అదరిపోయిందని, విజయ్ దేవరకొండ వన్‌మ్యాన్ షో అని కొనియాడుతున్నారు. విజయ్, రష్మిక కెమెస్ట్రీ బాగా కుదిరిందట. ఒక సాధారణ కథని వీరిద్దరూ హిట్టు బొమ్మగా మార్చేశారని అంటున్నారు. వెన్నెల కిశోర్ కామెడీ.. చిత్రానికి మరో ప్లస్ అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.