నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఏపీ28 బీడబ్ల్యూ 2323 కారులో తానే డ్రైవ్ చేస్తూ నెల్లూరు జిల్లా కావలిలో ఓ వివాహానికి బయలుదేరిన హరికృష్ణ. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో అటుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో హరికృష్ణ కారు నుంచి ఎగిరి బయటపడిపోయారు. తలకు బలమైన గాయమైంది. కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ఉదయం ఏడు గంటల సమయంలో హరికృష్ణ కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు.

హరికృష్ణ వయసు 61 సంవత్సరాలు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ కూడా నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
