మోక్షజ్ఞ కోసం బాలయ్య ఏం చేస్తున్నాడంటే..?

Nandamuri Balakrishna Son Mokshagna Tollywood Entry
Nandamuri Balakrishna Son Mokshagna Tollywood Entry

ఎన్నో ఏళ్లుగా నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా వాయిదా పడుతూ వస్తోంది. 2017-18 టైమ్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అనే వార్తలు అప్పట్లో గట్టిగానే షికారు చేశాయి. కానీ అలా జరగలేదు. ఇక అప్పటి నుంచి ఎప్పటివరకు బాలయ్య వారసుడి ఎంట్రీ పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఒకానొక టైమ్ లో మోక్షజ్ఞ కు మూవీస్ పై ఇంట్రెస్ట్ లేదనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఇటీవల వారసుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు నటసింహ నందమూరి బాలకృష్ణ. .

వచ్చే ఏడాది వారసుడి ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక వారసుడి ఎంట్రీ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా మోక్షజ్ఞను పబ్లిక్ వాతావరణంలో ఉంచడం, కుర్ర దర్శకులకు మోక్షజ్ఞను పరిచయం చేయడం వంటివి చేస్తున్నారు. ఆ మద్య బింబిసార మూవీ ప్రీమియర్స్ లోనూ, ఇటీవల హిట్ 2 స్పెషల్ షోలకు కూడా మోక్షజ్ఞను వెంటబెట్టుకొచ్చారు బాలయ్య. గతంలో మోక్షజ్ఞను పబ్లిక్ లోకి తీసుకొచ్చే వారు కాదు బాలయ్య.

కానీ ప్రస్తుతం తనయుడిని ఎక్కువ శాతం పబ్లిక్ లోనే ఉంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే దర్శకుడు ఎవరనే దానిపై క్లారిటీ లేనప్పటికి.. మోక్షజ్ఞని పక్క ప్రణాళికతో లంచ్ చేయాలని భావిస్తున్నారు బాలయ్య. కాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీ తో ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్.. ఫస్ట్ సినిమాతోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక కింగ్ నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా మొదటి సినిమాతో నిరాశ పరిచారు. మరి నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తన మొదటి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఫ్యాన్స్ నుంచి పవన్ కు హెచ్చరికలు !

చిరు మాస్ ట్రీట్ విత్ మాస్ రాజా గెట్ రెడీ!

రవితేజను లైన్లో పెడుతున్న పూరీ!