- Advertisement -
ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్లు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నగరంలోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
హెచ్‌సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్ అనే ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలుఉ విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.