మాస్ రాజా రవితేజ హిట్లు వచ్చి చాలకాలం అయింది.రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి.ఇటీవలే రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోని సినిమా కూడా ప్లాప్ అయింది.దీంతో రవితేజ రేస్‌లో బాగా వెనకపడ్డాడు.రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ చిత్రంతో పేరు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలి.
ప్లాన్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ నాటికి సెట్ వర్క్ పూర్తవ్వాలి. డిసంబర్ 1 నుండి షూటింగ్ మొదలుపెట్టాలి. కానీ ఇప్పటివరకు సెట్ వర్క్ పూర్తికాలేదు. నిర్మాత రామ్ తాళ్లూరికి రవితేజతో ఈ సినిమా చేయడం ఇష్టం లేదని, పైగా రెమ్యునరేషన్ గా రవితేజ రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో రామ్ తాళ్లూరి ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ సినిమా షూటింగ్‌లోనే నిర్మాతపై అరిచేశాడట.దీంతో ఇప్పుడు అసలు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా..? లేక ఆగిపోతుందా..? అనే సందేహాలు నెలకొన్నాయి.
- మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు: జగన్
- నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను!
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
