Friday, April 26, 2024
- Advertisement -

బాబు కొంప ముంచిన సొంత మీడియా….?

- Advertisement -

నాన్న పందులే గుంపుగా వ‌స్తాయి…సింహం సింగిల్‌గా వ‌స్తుంది అనే ర‌జినీ కాంత్ డైలాగ్ ఇప్పుడు కేసీఆర్‌కు క‌రెక్టుగా సూట‌వుతుంది. టీఆర్ఎస్‌ను ఓడించాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్‌, టీడీపీ, జ‌న‌స‌మితి, సీపీఐ పార్టీలు క‌ల‌సి మ‌హాకూట‌మిని ఏర్పాటు చేశారు. కూట‌మిని కేసీఆర్ సింగ్ హ్యాండ్‌తో ఎదుర్కొని విజేత‌గా నిలిచారు.

ఫ‌లితాలు ఎలా ఉన్నా కూట‌మి, టీడీపీ కొంప ముంచింది మాత్రం బాబు ఆస్థాన మీడియానే అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ మ‌రో సారి తెలంగాణా ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని న‌మ్ముకుని ఎన్నిక‌ల‌కు వెల్లారు. బాబు కూడా మ‌రో సారి ఆంధ్రా, తెలంగాణా అనే సెంటీ మెంట్‌ను ర‌గిలించేదానికి చేసిన ప్ర‌య‌త్నాల‌కు బాబు ఆస్థాన మీడియా కూడ ఆజ్యం పోసింది.

నిత్యం తెలంగాణలో హడావుడి అంతా, మహాకూటమి క్రెడిట్ అంతా చంద్రబాబుదే అన్నట్లు వార్తలు వండి వారుస్తూ వచ్చింది. చంద్రబాబు, బాలకృష్ణల ప్రచారాన్ని ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నం చూపించింది. కూట‌మి గెలుస్తోంద‌నే ప్ర‌చారాన్ని బాగా ప్ర‌చారం చేసింది.

దీంతో కేసిఆర్ అండ్ కో అందుకున్న ఆత్మగౌరవ నినాదానికి మరింత బలం వచ్చింది. కిందస్థాయి జనాలు తెలంగాణ పార్టీకే వేస్తాం అని టీఆర్ఎస్ ను ఓన్ చేసుకుంటూ చెఫ్పడం అనేక మీడియాల్లో కనిపించింది. ఇలాంటి టైమ్ లో బాబు అను’కుల’ మీడియా ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ బాబుకు, బాలయ్యకు ఎక్కువ ప్రచారం కలిపిస్తూ వచ్చింది.

ప‌చ్చ మీడియా ఎంత అనుకూలంగా ప్ర‌చారం చేసినా తెలంగాణా ప్ర‌జ‌లు మాత్రం కేసీఆర్‌కే ప‌ట్టం క‌ట్టారు. వంద‌ల కోట్లు డ‌బ్బులు, మ‌ద్యం పంచినా ప్ర‌జ‌లు మాత్రం త‌మ ఆత్మ‌గౌర‌వాన్నే న‌మ్ముకుని కూట‌మికి షాక్ ఇచ్చారు.
పనిలో పనిగా ఈ వార్తలను ఆంధ్రలో కూడా చూపించి, అక్కడ కూడా బాబుకు మార్కులు తెచ్చే పని ప్రారంభించింది. ఇదంతా గమనించి కేటిఆర్ బాహాటంగానే ఆ రెండు మీడియాల పని 11 తరువాత చెబుతాం అని బాహాటంగా హెచ్చరించారు. కూట‌మి ఓట‌మికి బాబు అనుకూల మీడియా అత్యుత్సాహ‌మే కొంప ముంచింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -