కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరిని ఓణికించింది ఈ పదం. ఇండస్ట్రీలో తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి కొందరు మహిళలు బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసింది. తాజాగా మరో హీరోయిన్ లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది హీరోయిన్ తల్లి. ఈ లైంగిక వేధింపులు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రాకు కూడా తప్పలేదట. ఈ లైంగిక వేధింపుల గురించి ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ప్రియాంక ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనల గురించి వివరించింది.
‘ఒక నిర్మాత కథ చెబుతానని నా కూతురిని మాత్రమేలోనికి పిలిచాడు. కథ చెప్పడానికి తనని మాత్రమే ఎందుకు పిలిచాడు. నన్ను కూడా పిలవొచ్చు కదా అనుకున్నాను. వేరొక నిర్మాత కూడా అలానే ప్రవర్తించాడు. కేవలం గదిలోకి రానన్నందుకు ప్రియాంక చోప్రా పది, పదిహేను అవకాశాలు కోల్పోయింది. గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించి వారికి సహకరించలేదని అవకాశాలు ఇవ్వలేదంటూ” మధుచోప్రా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇటీవలే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక.
- హనీమూన్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
- కేబినెట్ సమావేశానికి మళ్లీ పవన్ గైర్హాజరు
- మరో పోరాటానికి సిద్దమైన వైసీపీ, ముహూర్తం ఫిక్స్..
- రంగనాథ్‌ను అరెస్ట్ చేయండి?
- విద్యార్థులకు మద్దతు.. సల్మాన్ ఖాన్ పై ట్రోల్స్..
