టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బాలీవుడ్‌లో సైతం మహేశ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలికి ముందు తెలుగు హీరోలలో బాలీవుడ్ జనాలకు ఎవరైనా తెలుసాంటే అది మహేశ్ ఒక్కడే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేశ్ బాబు అంటే పడి చస్తారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి వచ్చి చేరింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. కంగనా తాజాగా నటించిన చిత్రం మణికర్ణిక. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. కొత్త ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది కంగనా.
దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు..సౌత్ లో అవకాశం వస్తే ఎవరితో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో అవకాశం వస్తే వదిలే ప్రసక్తే లేదని ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని కంగనా వివరణ ఇచ్చింది. దీంతో తెలుగులో మణికర్ణికకు దాదాపు క్రేజ్ వచ్చినట్టే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మణికర్ణిక సినిమాకు తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
