నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చిన , ఇవ్వకపోయిన వారి కుటుంబ సభ్యులు మాత్రం విరాళాలు ప్రకటిస్తు తాము అంత ఒక్కటే అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ పార్టీకి ఆయన మెగా కుటుంబం నుంచి విరాళం అందింది. అన్ని పార్టీల కంటే తక్కువ స్థాయిలో ఉన్న జనసేనకు మెగా యువ హీరోలు విరాళాలిస్తూ పవన్ కు తోడుగా నిలుస్తున్నారు. జనసేన పార్టీకి వరుణ్ తేజ్ కోటి రూపాయలు అలాగే నాగబాబు 25 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చినట్లు పవన్ ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఈ సహాయం తనకు ఒక క్రిస్టమస్ గిఫ్ట్ లాంటిదని ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సమయం చూసుకొని తప్పకుండా వారిని కలుస్తాను అని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. పవన్‌కు తన పెద్ద అన్నయ్య చిరు సపోర్టు లేకపోయినప్పటికి , తన రెండో అన్నయ్య నాగబాబు మాత్రం పవన్‌కు అన్ని సమయాలలో తోడుగా నిలుస్తు వస్తున్నాడు.
- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్‌గా అక్రమకేసులు!
- నిస్వార్ధంగా పని చేసినా గుర్తింపు లేదు..టీడీపీ నేత ఆవేదన
