ఓ పక్క నందమూరి – మెగా ఫ్యామిలీ యంగ్ హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్‌లు ఎటువంటి ఇగోలు లేకుండా కలిసి పని చేస్తుంటే మరో పక్క సీనియర్లు అయి ఉండి ఒకరిపై మరోకరు సెటైర్లు వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య హీరో బాలకృష్ణపై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది.మొదట బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని కామెంట్స్ చేశారు నాగబాబు. తిరిగి బాలకృష్ణ వంటి గొప్ప కామెడియన్‌ను తెలియదని చెప్పడం నా తప్పే అంటూ బాలకృష్ణపై సెటైర్స్ వేశారు నాగబాబు. ఈ గొడవ కాస్తా సర్ధుమణిగింది అనేకునే లోపు మళ్లీ బాలయ్యపై కవిత్వంతో సెటైర్ వేశాడు నాగబాబు.
రీసెంట్ గా బాలయ్య చెప్పే మా జాతి, మా రక్తం డైలాగులను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు నాగబాబు. దీనికి సంబంధించిన తన ఫేస్ బుక్ పేజీలో ఓ కవిత పోస్ట్ చేశాడు. కట్టు కథలు, కల్పనలు, నిజం కక్కలేని ఈ బయోపిక్కులు మాకొద్దంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.ఈ కవిత ద్వారా బాలయ్య నటించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై విమర్శలు గుప్పించాడు నాగబాబు.ఈ కవితపై అభిమానుల తలో రకంగా స్పందిస్తున్నారు.మరి ఈ కవిత ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
