Monday, May 6, 2024
- Advertisement -

ఛీ…ఛీ అంటున్నా పొత్తుకోసం ప‌వ‌న్ వెంట ప‌డుతున్న బాబు

- Advertisement -

ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నిక‌ల‌కు వెళ్లిన చ‌రిత్ర బాబుకు లేదు. అధికారం కోసం అందితే జుట్టు….అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకోవ‌డం బాబు నైజం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని సంకేతాలు వ‌స్తే…. ఆ పార్టీతో జ‌త క‌ట్ట‌డం బాబు రాజ‌కీయ మార్క్‌.

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, భాజాపాతో జ‌త క‌ట్టి అధికాంర‌లోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత జ‌రిగిన పరిణామాల వ‌ల్ల భాజాపాతో తెగ‌దెంపులు చేసుకున్నారు. త‌ర్వాత‌….ప‌వ‌న్ కూడా టీడీపీకీ దూరం జ‌రిగారు. అదే స‌మ‌యంలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య మాట‌ల యుద్ధం ఏస్థాయిలో జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్ మ‌ద్ద‌తుపూ న్యూట‌ర్న్ తీసుకోవ‌డంతో బాబు ఒడ్డున ప‌డ్డ చేప‌లా కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే మొద‌టి నుంచి పొత్తుల రాజ‌కీయం న‌డిపిన బాబు ఎన్నిల‌కు ఒంటరిగా వెళ్లాలంటే భ‌యం.

త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బాబు ప‌వ‌న్ పొత్తు కోసం వెంప‌ర్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పార్ట్ నర్స్ చంద్రబాబు వెత్తుకోవ‌డం అవసరం. బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకూ అందరూ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పాత వాళ్లతోనే బాబు పొత్తులతో కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అందుకే పవన్ కల్యాణ్ ను మళ్లీ గోకుతున్నాడు.

జ‌న‌సేన‌, టీడీపీ క‌ల‌సి పోటీ చేస్తే వైసీపీకీ ఎందుకు బాధ అన్న బాబు వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు ప‌వ‌న్‌. వామ‌ప‌క్ష పార్టీల‌తో త‌ప్ప ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమ‌ని ప్ర‌క‌టించారు. అయినా కూడా పొత్తు ఆశ‌లు బాబులో చావ‌డంలేదు. ప‌వ‌న్ ఛీ…ఛీ కొడుతున్నా ఆయ‌న సాన్నిహిత్యం కోసం ప‌రిత‌పిస్తున్నారు.

ఇప్ప‌టికే బాబు చేయించుకున్న సొంత స‌ర్వేలు, జాతీయ‌య స‌ర్వేలు వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేయ‌డ‌తో బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యింది. ఇంట‌లిజెన్స్ స‌ర్వే కూడా టీడీపీకీ వ్య‌తిరేకంగా రావ‌డంతో చేసేదేమి లేక‌…ప‌వ‌న్ పొత్తుకోసం ఆయ‌న వెంట ప‌డుతున్నారు.

తాజాగా మ‌రో సారి జ‌న‌సేన‌తో పొత్తుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రానికి 70 వేల కోట్లు రావాల‌ని జ‌న‌సేన ఫైడింగ్ ఫ్యాక్ట్ క‌మిటీ తెలిపింద‌న్నారు బాబు. రాష్ట్ర అభివృద్ధికోసం ప‌వ‌న్ క‌ల‌సి రావాల‌ని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ ఎంత ఛీ కొడుతున్నా పొత్తుకోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. బాబు రాజ‌కీయ జీవిత చరిత్ర అంతా పొత్తు, కుయుక్తుల‌తోనే గ‌డిచింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -