- Advertisement -

త‌మ‌న్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం..పెళ్లి చేసుకుంటావా!

- Advertisement -

తెలుగు,త‌మిళ ఇండ‌స్ట్రీల‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు గ‌త కొంతకాలంగా స‌రైన సినిమాలు రావ‌డం లేదు. వ‌చ్చిన సినిమాలు అన్ని ఫెయిల్ కావ‌డంతో రేసులో బాగా వెన‌క‌బ‌డింది. దీంతో త‌మ‌న్నా పెళ్లికి రెడీ అయింద‌నే వార్త‌లు వినిపించాయి. ఆమె అమెరికాలో సెటిల్ అయిన డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ వార్త‌లు నిజ‌మే అని క‌న్ఫమ్ చేశాడు త‌మిళ హీరో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…త‌మిళ హీరో ఉదయనిధి స్టాలిన్‌తో క‌లిసి త‌మ‌న్నా ‘కన్నే కలైమానే’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు హీరో, హీరోయిన్లు. ఓ అభిమాని త‌మ‌న్నా నువ్వంటే నాకు అంటే నాకు చాలా ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా అని త‌మన్నాని ప్ర‌శ్నించాడు. దీనికి స‌మాధానం చేప్పేలోపే మైక్ తీసుకున్న ఉదయనిధి స్టాలిన్ …అయ్యే తమన్నాకి అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీకు తెలియదా? అని ప్రశ్నించాడు.

దీంతో అక్క‌డ ఉన్నవారంత షాక్ అయ్యారు. గ‌తంలో త‌మ‌న్నాపై వ‌చ్చిన రూమ‌ర్లు నిజ‌మే అని ఈ సంఘ‌ట‌న‌తో తెలిపోయింద‌ని అనుకుంటున్నారు సినీ అభిమానులు. త‌మ‌న్నా.. ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో సెటిల్ అయిన డాక్ట‌ర్‌తో ప్రేమ‌లో ఉందని,అత‌ని కోస‌మే గ్యాప్ దొరికితే అమెరికా వెళ్తుంద‌ని ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌తో అర్థం అయింది. త్వ‌ర‌లోనే వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.త‌మ‌న్నా న‌టించిన ఎఫ్‌2 సినిమా మ‌రో రెండు రోజుల్లో విడుద‌ల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -