కియారా అద్వానీ ..తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. మహేశ్ బాబు నటించిన భరత్ అను నేను సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. కియారాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రెండో సినిమా ఛాన్స్ వచ్చింది. దీంతో ఈ భామ స్టార్ హీరోయిన్గా మారిపోతుందని అందరు ఆశించారు.
కియారా కూడా రామ్ చరణ్ వినయ విధేమ రామ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది. కాని ఫలితం మెగా అభిమానులతో పాటు కియారాను నిరాశకు గురి చేసిందట. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఘోరంగా ప్లాప్ అయింది. ఈ సినిమాపై తాను పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోవడంతో కైరా అద్వాని బాగా అప్సెట్ అయిందట. మహేశ్‌తో హిట్ కొట్టిన కియారాకు రామ్ చరణ్ ప్లాప్ ఇచ్చాడు. ఇక మీద స్టార్ హీరోల సినిమాలు అయిన కూడా నచ్చితేనే చేయలనే ఆలోచనలో ఉందట కియారా.
కియారాకుతెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ మూవీలో నటిస్తుంది కియారా. ఈ సినిమాతో పాటు మరో కరణ్ జోహార్ నిర్మించే సినిమాలో కూడా ఛాన్స్ దొరికినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త సినిమాలో కూడా కియారానే హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
