తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది నటి తేజస్వి. అంతకు ముందు అరకొర సినిమాలలో నటించినప్పటికి సరైన గుర్తింపు రాలేదు. దీంతో బిగ్‌బాస్ రెండో సీజన్లో కంటెస్టెంట్‌గా వచ్చి బాగా ఫేమస్ అయింది తేజస్వీ. బిగ్‌బాస్‌లో ఆమె తన ప్రవర్తనతో విమర్శల పాలైంది. బిగ్‌బాస్ రెండో సీజన్ మొత్తంలో విలన్‌గా మారింది తేజస్వీ. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇటీవలే కమెడియన్ బ్రహ్మనందంతో కలిసి ఓ షోకి యాంకరింగ్ చేసింది ఈ భామ.
ఈ షో కాస్తా ఫెయిల్ కావడంతో ఏకంగా ఈ షోనే తీసేశారు నిర్వహాకులు. ఆ సమయంలో కూడా తేజస్వీ తీవ్ర విమర్శల పాలైంది. ప్రస్తుతం నటిగా అవకాశాలు వెతికే పనిలో పడింది తేజస్వీ. సినిమాలలో అవకాశాలు రావాలనో లేక తన గ్లామర్‌ను జనాలకు చూపించాలి అనుకుంటుందో తెలియదు కాని సడన్‌గా హాట్ ఫోటో షూట్‌తో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోలలో కాస్తా గ్లామర్‌గానే కనిపించింది. మరి తేజస్వీ అందాలు చూసి అయిన సినిమాలలో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
- కృతి సనన్ ను భయపెడుతున్నదేంటో తెలుసా?
- ఏపీలో అర్నాబ్ తుపాను విధ్వంసం
- షర్మిలకు వైఎస్ భారతిరెడ్డి లేఖ.. క్లారిటీ ఇదే
- ‘అబ్సెషన్’ ఓటీటీ ఎంట్రీకి సిద్దం.. ఎక్కడంటే?
- అభిషేక్ సెంచరీపై యువరాజ్ రియాక్షన్ ఇదే!
