అనిల్ రావిపూడి… ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ దర్శకుడు చూట్టునే తిరుగుతోంది. తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికి ఆ నాలుగు సినిమాలను హిట్ చేశాడు అనిల్ రావిపూడి. పటాస్,సుప్రీమ్,రాజా ది గ్రేట్. తాజాగా ఎఫ్ 2 సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తాను అనుకున్న కథకు ఎంటర్‌టైన్ జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయలని ప్లాన్ చేస్తున్నారు.
మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరాడు. ఎన్టీఆర్‌తో గతంలోనే అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అటు అనిల్ కాని , ఇటు ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
