అనిల్ రావిపూడి… ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ దర్శకుడు చూట్టునే తిరుగుతోంది. తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికి ఆ నాలుగు సినిమాలను హిట్ చేశాడు అనిల్ రావిపూడి. పటాస్,సుప్రీమ్,రాజా ది గ్రేట్. తాజాగా ఎఫ్ 2 సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తాను అనుకున్న కథకు ఎంటర్టైన్ జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయలని ప్లాన్ చేస్తున్నారు.
మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరాడు. ఎన్టీఆర్‌తో గతంలోనే అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అటు అనిల్ కాని , ఇటు ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.
- ముంబయి ఇండియన్స్ సంచలన నిర్ణయం!
- ఉత్కంఠ రేపుతున్నా ఇజ్రాయెల్ ఎన్నికలు!
- అది నా తప్పే.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!
- బీర్ల కంపెనీలకు నీళ్లు.. రైతులకు కన్నీళ్లా..!
- ‘కరువును ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్దం’
- ఇండియా కూటమి ర్యాలీకి మద్దతు తెలిపిన సీజేపీ
